: శీతాకాల సమావేశాలు అడ్డుకోవద్దు: ప్రతిపక్షాలకు వెంకయ్య విజ్ఞప్తి
బీహార్ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు శీతాకాల సమావేశాలు అడ్డుకోవద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశమైన పార్లమెంటరీ బోర్డు సమావేశానంతరం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నవంబర్ 26 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయని అన్నారు. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినందుకు గుర్తుగా డాక్టర్ అంబేద్కర్ ను గౌరవిస్తూ రెండు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. బీహార్ ఎన్నికలు ప్రజాకాంక్ష మేరకు వచ్చాయని, వాటిని అవకాశంగా తీసుకుని పార్లమెంటు సమావేశాలకు విఘాతం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.