: బీహార్ ఓటమిపై సమావేశమైన బీజేపీ తేల్చిందిది!
బీహార్ ఓటమిపై సమావేశమైన పార్లమెంటరీ బోర్డు రెండు గంటలపాటు సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన, బీజేపీ అధినేత అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీల బృందం ఓటమిపై విశ్లేషణలు చేసి, ఓ నిర్ణయానికి వచ్చాయి. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బీహార్ ఎన్నికల్లో జేడీ (యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ జట్టుగా మహాకూటమిగా ఏర్పడడం వల్లే ఓటమిపాలయ్యామని తేల్చారు. బీహార్ లో ఓటమిని అంగీకరిస్తున్నామని, అక్కడ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ వ్యాఖ్యలు తమ ఓటమికి కారణం కాదని చెప్పారు. రిజర్వేషన్లపై తమ పార్టీ వైఖరి సరిగానే ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వేదాంతం వల్లె వేశారు. తమపై దుష్ప్రచారం చేసినందువల్లే ఓటమిపాలయ్యామని పేర్కొన్నారు. మహాకూటమి బలం అంచనా వేయలేకపోయామని అంగీకరించారు. బీహార్ లో ఓడినా అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించామని సర్దిచెప్పుకున్నారు. బీహార్ ఫలితాలు ప్రధాని మోదీ పనితీరుకు రెఫరెండం కాదని తీర్పు చెప్పారు. బీజేపీ నేతలు బాధ్యతగా మాట్లాడాలని పేర్కొన్నారు.