: ధన త్రయోదశి కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధర!
ధన త్రయోదశి కొనుగోళ్ల కారణంగా సోమవారం పసిడి ధర పెరిగింది. రూపాయి మారకం విలువ మరింత తగ్గడం, నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి బంగారం కొనుగోళ్లు మళ్లీ పెరగడంతో ధర పెరుగుతోందని మార్కెట్ వర్గాల సమాచారం. రూ.120 పెరగడంతో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.26,230కి చేరుకుంది. కాగా, రజతం ధర కూడా ఈరోజు పెరిగింది. రూ.110 పెరగడంతో కిలో వెండి ధర రూ.35,410కి చేరుకుంది.