: వాట్స్ యాప్ లో... కాంగ్రెస్ వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం
వరంగల్ లోక్ సభ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ వినూత్నంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. 'ఒక్క కేసీఆర్- వంద అబద్ధాలు' పేరుతో వాట్స్ యాప్ వేదికగా సరికొత్త ప్రచారం చేయనుంది. ప్రజలకు ఇచ్చిన హామీలపై కేసీఆర్ మాట్లాడిన వీడియోలను తెలంగాణ కాంగ్రెస్ వాట్స్ యాప్ లో పోస్టు చేయనుంది. అంతేగాక టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై గ్రామాల్లో ప్రచారం చేయాలని యువకులకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.