: టీమిండియా సెలక్టింగ్ కమిటీలో తెలుగు తేజం ఎంఎస్కే ప్రసాద్ కు చోటు


టీమిండియా జట్టు జాతీయ సెలక్టింగ్ కమిటీలో తెలుగువాడైన మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ కు బీసీసీఐ చోటు కల్పించింది. భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లను తప్పించిన బోర్డు, వారి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎంఎస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించింది. ఈ మేరకు బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆంధ్రా నుంచి జాతీయ సెలక్టర్ గా ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రసాద్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 6 టెస్టులు, 17 వన్డేల్లో ఆయన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1999-2000లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరపున ఆడాడు.

  • Loading...

More Telugu News