: బీహార్ ఎఫెక్ట్!... భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
బీహార్ లో నిన్న విడుదలైన ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై పెను ప్రభావాన్నే చూపాయి. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సెన్సెక్స్ 550కి పైగా పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ కూడా 150కి పైగా పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. రూపాయి విలువ కూడా భారీగా పతనమైంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 62 పైసలు తగ్గింది. నిన్న వెలువడ్డ బీహార్ ఎన్నికల ఫలితాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఈ ఫలితాలు స్టాక్ మార్కెట్లను భారీగా దెబ్బతీశాయి.