: కాంగ్రెస్ పార్టీ నుంచి సిరిసిల్ల రాజయ్య సస్పెన్షన్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద మృతిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలోనే పార్టీ నుంచి రాజయ్యను సస్పెండ్ చేసినట్లు సమాచారం. కాగా, రాజయ్య కోడలు, మనవళ్ల మృతి కేసులో ఆయనతో పాటు కుటుంబసభ్యులు కూడా జైలులో ఉన్నారు. రాజయ్య కుటుంబసభ్యుల వేధింపులే సారిక మృతికి కారణమని పోలీసులు తమ రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. తమ కుమార్తె సారిక మృతికి రాజయ్య కుటుంబసభ్యులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. ఇదిలా ఉంచితే, అనిల్ రెండో భార్య సనను పోలీసుల అరెస్టు చేయడం తెెలిసిందే.