: అనిల్ రెండో భార్య అరెస్టు


కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మృతి కేసులో అనిల్ రెండో భార్య సనను ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న సన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గత కొన్ని రోజులుగా వెతుకుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాడు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నట్లు వారు తెలిపారు. కాగా, కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్ల మృతి కేసులో పోలీసులు కోర్టుకు శనివారం రిమాండ్ నివేదికను సమర్పించారు. అత్తమామలు మాధవి, రాజయ్య, తన భర్త అనిల్, అతని రెండో భార్య సన వేధింపుల కారణంగానే సారికకు తన జీవితంపై విరక్తి కల్గి ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News