: దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని ఈ విజయం నిరూపించింది: ఒమర్ అబ్దుల్లా


‘దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని మీ విజయం నిరూపించింది. మీరు సాధించిన విజయం చాలా గొప్పది. అందుకు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను’ అంటూ నితీశ్ కుమార్ ని ఉద్దేశిస్తూ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి దూసుకెళ్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి 53 స్థానాల్లో గెలుపు సాధించగా, మరో 121 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. బీహార్ లో మహాకూటమి నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్న విషయం తెలిసింది.

  • Loading...

More Telugu News