: బీహార్ లో మహా కూటమి విజయం... బెజవాడలో యూత్ కాంగ్రెస్ సంబరాలు


ఏపీలో గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతానే తెరవలేకపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రులు కాంగ్రెస్ పై కన్నెర్రజేశారు. పీసీసీ చీఫ్ రఘువీరా సహా కీలక నేతలకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. దీంతో ఆ పార్టీ యువజన విభాగం యూత్ కాంగ్రెస్ పూర్తిగా నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టిన మహా కూటమి బీహార్ లో ఘన విజయం సాధించబోతోంది. మూడింట రెండు వంతుల సీట్లను కూటమి కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. దీంతో యూత్ కాంగ్రెస్ కు చెందిన ఏపీ విభాగంలో కొత్త ఉత్సాహం వచ్చేసింది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. సొంత రాష్ట్రంలో కాకున్నా, దేశంలోని కీలక రాష్ట్రమైన బీహార్ లో తమ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి విజయం సాధించడం యుత్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఇక పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా బీహార్ లో మహా కూటమి విజయంపై హర్షం ప్రకటించారు.

  • Loading...

More Telugu News