: నితీశ్, లాలూలకు కల్వకుంట్ల కవిత గ్రీటింగ్స్!


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్న మహా కూటమికి తెలంగాణ జాగృతి సంస్థ చీఫ్, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. కొద్దిసేపటి క్రితం బీహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కవిత బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ లకు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే, ఓట్ల లెక్కింపులో మహా కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే 19 స్థానాల్లో విజయం సాధించిన మహా కూటమి మరో 144 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. ఇక ఒక స్థానంలో విజయం సాధించిన బీజేపీ మరో 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • Loading...

More Telugu News