: వాడి తగ్గినా వేడి తగ్గని దిగ్గజాలు!


క్రికెట్ అభిమానులు ఇంతవరకు చూడని చిత్రవిచిత్రాలను ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీ పరిచయం చేసింది. కొద్దిగా నెరసిన జుట్టు, కొంచెం ముందుకొచ్చిన పొట్ట, దూకుడు లేకుండా మెరుపువేగంతో బంతులను సంధించే బౌలర్లు, వాడి తగ్గడంతో వేగంగా వస్తున్న బంతులను మెల్లిగా స్టాండ్స్ లోకి తరలిస్తూ మరికొందరు దిగ్గజ బ్యాట్స్ మెన్ అభిమానులను అలరించారు. కొట్నీ వాల్ష్, అలెన్ డొనాల్డ్, అక్రమ్, కలిస్, షోయబ్ అక్తర్, కార్ల్ హూపర్ ల వాడి తగ్గగా... వార్న్, వెటోరీ, మురళీ ధరన్ బంతుల్లో ఏమాత్రం తేడా రాకపోవడం విశేషం. ఫీల్డింగ్ లో మెరుపు వేగంతో జాంటీ రోడ్స్, పాంటింగ్, జయవర్థనే, సంగక్కర, కలిస్ బంతులను అందుకున్న విధానం అభిమానుల మతులు పోగొట్టింది. బ్యాటింగ్ లో సచిన్, సెహ్వాగ్, జయవర్థనే, సంగక్కర, హేడెన్, కలిస్, పాంటింగ్, జాంటీ రోడ్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News