: స్వీట్స్ లో విషం కలుపుకుని... చిత్తూరు జిల్లాలో కూతుళ్లతో కలిసి దంపతుల ఆత్మహత్య


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో నేటి ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయి. ఇద్దరు చిన్నారి కూతుళ్లకు విషమిచ్చిన దంపతులు బలవన్మరణం చెందారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోటలో వెలుగు చూసిన ఈ దారుణంలో మణి, లక్ష్మీదేవి దంపతులు వారి ఇద్దరు కూతుళ్లు భవ్య (7), సుచిత్ర (4) కన్నుమూశారు. స్వీట్స్ లో విషం కలుపుకుని తిన్న ఆ దంపతులు, అవే తీపి పదార్థాలను తమ ఇద్దరు కూతుళ్లకు తినిపించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాము ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నామని మణి రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు చిన్నారులతో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో పి.కొత్తకోటలో విషాద ఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News