: పవన్ కల్యాణ్ కు అంత తీరిక లేదు: అలీ
సినీ నటుడు పవన్ కల్యాణ్ కి సన్నిహితుడిగా పేరున్న అలీ వివాదాస్పద కామెంట్లపై ఏమంటారన్న ప్రశ్నకు అలీ సమాధానమిస్తూ సోషల్ మీడియాలో ఆయనపై కూడా చాలా వ్యాఖ్యలు చేస్తారని అన్నాడు. ఆయనపై ఎవరేం మాట్లాడారో చూసుకునే తీరికే అయనకు లేదు...ఇక తనపై రేగిన వివాదంపై ఆయన ఎలా స్పందిస్తారని అలీ చెప్పాడు. పవన్ కల్యాణ్, తాను స్నేహితులమనడంలో ఎలాంటి సందేహం లేదని అలీ తెలిపాడు. అయితే తమ స్నేహానికి పరిమితులు ఉన్నాయని అలీ చెప్పాడు. ఏ సినిమాలు చేస్తున్నావు? ఏ సినిమాలు బాగున్నాయి? ఏ పాత్రలైతే బాగుంటాయి? అంటూ సినిమాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటామని అలీ చెప్పాడు. అంతే తప్ప ఆయన తన జీవిత ఘటనల గురించి అడగరు, తాను కూడా ఆయన వ్యక్తిగతం, రాజకీయాల గురించి అడగనని స్పష్టం చేశాడు. ఇలాంటి వాటిని పట్టించుకునే తీరిక కూడా ఆయనకు ఉండదని అలీ తెలిపాడు. మధ్యలో అలీ భార్య మాట్లాడుతూ, సోషల్ మీడియాలో తన భర్తను ఎవరెవరో ఏదో అంటున్నారని మండిపడ్డారు. ఏ హక్కూ లేనివారంతా ఆయనను నిందిస్తే, అలాంటి వారిపై తాను ఎలా స్పందించాలో ఓ సారి ఆలోచించాలని ఆమె సూచించారు. ఆయనేంటో సినీ పరిశ్రమకు తెలుసని ఆమె తెలిపారు.