: తెలంగాణ పోలీసు ఉద్యోగాల భర్తీలో దేహదారుఢ్య పరీక్షలు సరళతరం
తెలంగాణ రాష్ట్రంలో 9వేలకు పైగా పోలీసు ఉద్యోగాల భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేహదారుఢ్య పరీక్ష విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇందులో పురుషులకు 5 కి.మీ పరుగు, మహిళలకు 2.5 కి.మీ పరుగు పోటీని రద్దు చేస్తూ సీఎం కేసీఈర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక పోలీస్ శాఖలో మెకానికల్ ఉద్యోగాల కోసం ఆర్టీసీ మాదిరిగా ట్రేడ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఆర్మీలో మాదిరిగా పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. అభ్యర్థుల రాత పరీక్ష సిలబస్ లో తెలంగాణ చరిత్ర తప్పనిసరి చేశారు. మరోవైపు పిఈటీ నియామక ప్రక్రియలో కూడా మార్పులు చేశారు. పురుషులు 800 మీటర్ల పరుగుతో పాటు ఏవైనా మరో రెండు విభాగాల్లో ప్రతిభ చూపాలి. మహిళలు 100 మీటర్ల పరుగుతో పాటు మరో విభాగంలోనూ ప్రతిభ చూపాల్సి ఉంటుంది.