: ఇంద్రాణి ముఖర్జియా జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు


కన్నకూతురినే హత్య చేసిందన్న ఆరోపణలతో జైలు జీవితం అనుభవిస్తున్న వ్యాపారవేత్త ఇంద్రాణి ముఖర్జియా రిమాండ్ ను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. ముంబైలోని మెట్రోపాలిటన్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ ల కస్టడీని కూడా పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈనెల 17 వరకు వీరు ముగ్గురినీ ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. ఇప్పటి వరకు నిందితులు ముగ్గురినీ జైలులోనే సీబీఐ అధికారులు విచారించారు.

  • Loading...

More Telugu News