: దక్షిణాఫ్రికా పతనమూ మొదలు... 9/2!


స్పిన్ కు అత్యంత అనుకూలంగా ఉన్న పిచ్ పై రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా పతనం మొదలైంది. 218 పరుగుల అసాధ్యం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను ఆదిలోనే జడేజా ఆత్మరక్షణలో పడేశాడు. అశ్విన్ వేసిన తొలి ఓవర్లో 8 పరుగులు రాబట్టుకుని ఊపుమీద కనిపించిన జట్టును, రెండో ఓవర్ వేసిన జడేజా తొలి బంతికే ఫిలాండర్ ను అవుట్ చేయగా, ఆపై మూడో ఓవర్ వేసిన అశ్విన్ తన రెండో బంతికి డుప్లెసిస్ ను అవుట్ చేసి చావుదెబ్బతీశాడు. వీరిద్దరూ చెరో పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 2.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 9 పరుగులు.

  • Loading...

More Telugu News