: పెళ్లికూతురవుతున్న 'రస్నా బేబీ'... ఎన్నారైతో ముంబైలో నిశ్చితార్థం
'లాహిరి లాహిరి లాహిరిలో', 'సింహాద్రి', 'ధనలక్ష్మి ఐ లవ్ యూ' వంటి చిత్రాల్లో నటించిన అందాల భామ అంకిత అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతకంటేముందు చిన్నప్పుడే 'ఐ లవ్ యూ రస్నా' అంటూ ఆకట్టుకున్న ఆ రస్నా బేబీనే ఈ అంకిత అని కూడా అందరికీ తెలిసిందే. తాజాగా ఈ అమ్మడికి పెళ్లి కుదిరింది. న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ విశాల్ జగ్తాప్ తో ముంబైలోని మారియట్ హోటల్ లో పెద్దల సమక్షంలో అంకిత నిశ్చితార్థం నిన్న (శుక్రవారం) జరిగింది. త్వరలోనే వారి వివాహం జరగనుంది. కొంతకాలం తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న అంకిత తరువాత అవకాశాలు తగ్గడంతో యూఎస్ వెళ్లిపోయింది. అక్కడ హాలీవుడ్ స్టూడియోలో ఫిలిం టెక్నాలజీ కోర్స్ చేసింది. అంతేగాక కొంతమంది హాలీవుడ్ దర్శకుల వద్ద కూడా పనిచేసింది.