: దళితులను విడగొట్టిన పాపం మంద కృష్ణదే: కారెం శివాజీ


ఏపీలో మాదిగ, మాల కులాల మధ్య వివాదం మళ్లీ రాజుకునేలా ఉంది. ఎస్సీ వర్గీకరణ పేరుతో ఏపీలో పర్యటిస్తున్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పించారు. మాదిగలను చంద్రబాబు మోసం చేశారని ఆయన బహిరంగంగా విమర్శించారు. ఈ క్రమంలో, మంద కృష్ణపై మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ విరుచుకుపడ్డారు. కలసి మెలసి ఉన్న దళితులను విడగొట్టింది మంద కృష్ణే అని అన్నారు. వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. మాల సామాజిక వర్గానికి రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News