: 'స్వచ్ఛ భారత్' పన్నుతో జేబు మరింత గుల్ల!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రజలపై వేసిన 'స్వచ్ఛ భారత్' పన్నుతో మీ జేబు నుంచి మరింత డబ్బు కేంద్ర ఖజానాకు చేరనుంది. అన్ని రకాల సేవలపై 0.5 శాతం పన్ను వేసిన నేపథ్యంలో ప్రతి రూ. 100 విలువైన సేవకు అర్ధ రూపాయి అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి. విమాన ప్రయాణాల దగ్గర్నుంచి, హోటళ్లలో భోజనం వరకూ... కరెంటు బిల్లుల చెల్లింపు నుంచి సినిమా హాళ్లు, పార్కింగ్ స్టాండ్లు, బస్సు, రైలు ప్రయాణాల వరకూ ఎవరి నుంచి ఏ సర్వీస్ ను తీసుకున్నా ఈ అదనపు బాదుడు తప్పదు. ఇండియాను మరింత పరిశుభ్రంగా చేసేందుకు ప్రధాని మోదీ తలపెట్టిన కార్యక్రమానికి అవసరమైన నిధుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పెంచిన పన్నులను కేంద్రం సమర్థించుకుంది. కాగా, స్వచ్ఛ భారత్ పన్ను ద్వారా ఏటా కేంద్ర ఖజానాకు రూ. 400 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని సమాచారం. ఇక మీ జేబు నుంచి మరింతగా వదిలించుకుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి!