: వారు మనకు మాత్రమే దిగ్గజాలు మరి!
సమకాలీన క్రీడా ప్రపంచంలో సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్... ఈ పేర్లు వినని భారతీయులు ఉంటారా? ఆస్ట్రేలియన్లు ఉంటారా? పాకిస్థానీలు, శ్రీలంక వాసులు, బ్రిటన్ దేశస్తులు, న్యూజిలాండ్ వారు ఉంటారా? ఉండరనే సమాధానమే వస్తుంది. కానీ అమెరికన్లు, జర్మన్లు అంటే... క్రికెట్ ఆట పరిచయం లేని వారికి ఈ ఆటగాళ్ల గురించి ఏం తెలుస్తుంది? అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది. సచిన్, వార్న్ లు చక్కాగా అమెరికా వీధుల్లో చక్కర్లు కొడుతుంటే ఎవరూ గుర్తు పట్టడం లేదట. న్యూయార్క్ వీధుల్లో వీరు స్వేచ్ఛగా నడుస్తుంటే, పది మంది కూడా దగ్గరికి రావడం లేదు. వీరిద్దరూ అమెరికన్లకు క్రికెట్ ను పరిచయం చేసేందుకు మాజీ ఆటగాళ్లను కలుపుకుని 'ఆల్ స్టార్స్' పేరిట టీ-20 మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. వీరి గురించి తెలిసిన వారు మాత్రం ఇద్దరు దిగ్గజాలను ఇంత దగ్గర నుంచి చూస్తామని, మాట్లాడతామని అనుకోలేదని ఆనందంగా ఉన్నారు. అవును మరి. వారు మనకు మాత్రమే దిగ్గజాలు కదా?