: రెండు వారాల్లోగా ఇంటి అద్దె చెల్లించండి... బాలీవుడ్ నటుడికి ‘సుప్రీం’ మందలింపు


ఇంటి అద్దె చెల్లించకుండా యజమానురాలిని ఎందుకు వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలిని సుప్రీంకోర్టు మందలించింది. ఇప్పటివరకు చెల్లించాల్సిన అద్దె మొత్తాన్ని రెండు వారాల్లోగా యజమానురాలికి చెల్లించాలని, డిసెంబర్ 31 లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ‘మీరు చాలా పెద్దమనిషి. ఇల్లు లేదా ఒక ఫ్లాట్ కొనుగోలు చేసుకునే స్థోమత ఉన్న వారు. ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం బాగుండలేదు. మీ పద్ధతి మార్చుకోండి’ అని సుప్రీంకోర్టు ఆదిత్య పచోలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News