: 'కానిబాల్'ని కాను 'తాలిబన్'ని... అమెరికన్ల తలకాయలు తింటాను...సంచలన వీడియో
నరమాంస భక్షకులను 'కానిబల్స్' అంటారన్న సంగతి తెలిసిందే. అయితే, తాను 'కానిబల్' కాదు 'తాలిబన్'ను అనీ, అమెరికన్ల తలకాయలు తింటానని ఓ తీవ్రవాది చెబుతున్న మాటల వీడియో సంచలనం రేపుతోంది. తీవ్రవాదుల చర్యలని బయటపెట్టాలంటే ఎంతో ధైర్యం కావాలి. అంత ధైర్యాన్ని ఓ యువతి ప్రదర్శించిందంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఆఫ్ఘనిస్థాన్ లోని మారుమూల ప్రాంతం నుంచి కాబూల్ కు ఓ యువతి బస్సులో ప్రయాణిస్తోంది. ఇంతలో తాలిబన్ చెక్ పోస్టు దగ్గర బస్సు ఆగింది. దీంతో బస్సెక్కిన తాలిబన్ ను బస్సులోని వారంతా చిత్రంగా చూశారు. దీంతో తాను కాలిబన్ కాదు తాలిబన్ అని, అంత చిత్రంగా చూడవద్దని పేర్కొన్నాడు. మీలో ఎవరైనా ప్రభుత్వోద్యోగులుంటే వెంటనే ఉద్యోగం మానేయాలని సూచించాడు. ప్రయాణికులంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఇంతలో ఓ ప్రయాణికుడు మీరు పస్తూన్ తెగవారా? అని అడుగగా, తమకు పస్తు, పార్సీ, ఉజ్బెక్కా, టర్కీనా అనే తేడాలు ఉండవని, రష్యన్ అయినా ముస్లిం మతాన్ని అనుసరిస్తే తమ సోదరులేనని ఆయన పేర్కొన్నాడు. 8 గంటల పాటు సాగిన ప్రయాణంలో తాలిబన్ తో ప్రయాణికులు జరిపిన సంభాషణను ఓ యువతి రహస్యంగా చిత్రీకరించింది. స్నేహితుల ప్రోత్సాహంతో ఆమె ఆ వీడియోను బయటపెట్టింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.