: తను ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్... చివరికి ఏటీఎం దొంగ అయ్యాడు


ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ ఏటీఎం దొంగగా మారడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బతుకుతెరువుకు సరిపడా మేధోసంపత్తి ఉన్నప్పటికీ ధనవంతుడవ్వాలన్న కోరికే అతడిని దొంగగా మార్చిందని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే...చిలకలూరిపేటలో అన్ని ఏటీఎంలకు ఎన్సీఆర్ ఇంజనీర్స్ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నగదు సరఫరా అవుతోంది. ఈ క్రమంలో అక్టోబర్ 5న ఎస్బీఐ ఏటీఎం నుంచి 15.50 లక్షల నగదు అపహరణకు గురైంది. దీంతో అదే రోజు ఆ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నెల రోజుల వ్యవధిలో కేసును ఛేదించడం విశేషం. ఎన్సీఆర్ ఇంజనీర్స్ సంస్థలో పని చేసే నర్సిరెడ్డి అన్నం పెట్టిన సంస్థకు కన్నం వేశాడని తెలిపారు. రోజూ ఏటీఎంలో నగదు మార్చే కస్టోడియన్ల నుంచి పిన్ నంబర్లను దొంగతనంగా సేకరించిన నర్సిరెడ్డి ఈ చోరీకి పాల్పడ్డాడని నిర్ధారించారు. బీటెక్ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన నర్సిరెడ్డి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News