: సినిమాలో నటించనున్న మంత్రి పల్లె


ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలుగు సినిమాలో నటించనున్నారు. 'సతీ తిమ్మమాంబ' అనే చారిత్రక చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధ తిమ్మమ్మ మర్రిచెట్టు ప్రాముఖ్యతపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రిపుల్ ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత బి.సుబ్రహ్మణ్యం కాగా, ఆంజనేయులు దర్శకత్వం వహిస్తున్నారు. జిల్లాలోని కదిరి సమీపంలో 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రఖ్యాత తిమ్మమ్మ మర్రిమాను విస్తరించింది. అతిపెద్ద వృక్షంగా 1989లో ఈ వృక్షం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రతి రోజు ఎంతో మంది ఈ చెట్టును చూడ్డానికి వస్తుంటారు.

  • Loading...

More Telugu News