: మాజీ ఎంపీ రాజయ్య కోడలు, మనవల పోస్టు మార్టం రిపోర్ట్ రెడీ


మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల పోస్టు మార్టం రిపోర్ట్ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు పోలీసులకు అందజేశారు. పోస్టు మార్టం రిపోర్టులో నలుగురూ మంటల ధాటికి దగ్ధమైపోయినట్టు పేర్కొన్నారు. మంటల వేడికి నలుగురి ఎముకలు విరిగిపోయాయని నిపుణులు పేర్కొన్నారు. సంఘటన జరిగిన సమయంలో వారు బతికే ఉన్నారని, వారి శ్వాసకోశాలు పొగచూరాయని నిపుణులు పోస్టుమార్టం రిపోర్టులో తెలిపారు. మృతదేహాల్లోని నమూనాలు సేకరించి హైదరాబాదు పంపినట్టు పోస్టు మార్టం నిర్వహించిన నాగమోహన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News