: ఒంటరి జీవులు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలట!
ఒంటరి జీవితానికి అలవాటు పడ్డవాళ్లు తమ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం వహిస్తారట. అలాంటి వారు సమయానికి తిండి తినకుండా ఉంటే వారు మరింత తొందరగా అనారోగ్యం పాలవుతారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందుకే, ఇలాంటి ఒంటరి వాళ్లు సమయానికి కచ్చితంగా తిండి తినాలని అధ్యయనకార్లు సెలవిస్తున్నారు. కంప్యూటర్ ముందు కూర్చునో, పుస్తకం చదువుతూనో, లేక వేరే పనుల్లో నిమగ్నమైపోయే ఒంటరి వ్యక్తులు తమ ఆరోగ్యంపై కూడా కాస్త దృష్టి పెట్టాలని ఈ తాజా స్టడీ చెబుతోంది. లేకపోతే కనుక ఆసుపత్రి పాలవ్వచ్చని ఈ అధ్యయనాన్ని చేబట్టిన వారు హెచ్చరిస్తున్నారు.