: షారూక్ నివాసం వద్ద మరింత భద్రత !
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నివాసం వద్ద పోలీసు భద్రతను పెంచారు. ముంబయిలోని ఆయన నివాసం మన్నత్ వద్ద ప్రస్తుతం ఉన్న పోలీసు బందోబస్తుతో పాటు అదనంగా మరో 25 మంది పోలీసులను గురువారం నాడు నియమించారు. తమ అభిమాన నటుడి కోసం చాలా మంది అభిమానులు ఈ ప్రాంతంలో ఎదురు చూస్తుంటారు. కాగా, షారూక్ నివాసం వద్ద 2010నుంచి రాష్ట్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్ కు చెందిన 50 మంది బందోబస్తుగా ఉంటున్నారు. గతంలో శివసేన హెచ్చరికల నేపథ్యంలో షారూక్ నివాసం వద్ద బందోబస్తుకు నాటి ప్రభుత్వం అంగీకరించింది. అయితే, ఈసారి మాత్రం షారూక్ ఖాన్ కు మద్దతుగా శివసేన పార్టీ నిలబడింది. మతాన్ని ఆధారంగా చేసుకుని షారూక్ ని టార్గెట్ చేయడం సబబు కాదని శివసేన పేర్కొన్న విషయం తెలిసిందే.