: వికీపీడియాలో సిద్ధరామయ్య పేరు శామ్యూల్ గా మార్పు


గోమాంసం తినడానికి తాను సిద్ధమని ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శల పర్వం కొనసాగుతోంది. గోమాంసం తింటే ఆయన తల నరికేస్తామని ఓ బీజేపీ నేత బహిరంగంగానే హెచ్చరించారు. ఇదే సమయంలో ఆయనపై ఆన్ లైన్ లోనూ దాడి కొనసాగుతోంది. ఈ క్రమంలో, గుర్తు తెలియని ఓ వ్యక్తి వికీపీడియాలోని సిద్ధరామయ్య పేజ్ ను మార్చి వేశాడు. సిద్ధరామయ్య పేరును శామ్యూల్ గా మార్చాడు. విషయాన్ని గమనించిన అధికారులు ఈ అంశాన్ని వికీపీడియా అడ్మినిస్ట్రేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, వారు వెంటనే శామ్యూల్ పేరును తొలగించి సిద్ధరామయ్య అనే పేరును ఉంచారు. కర్ణాటకలో గోమాంసంపై నిషేధం విధించాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తుండటంపై కొద్ది రోజుల క్రితం స్పందించిన సిద్ధరామయ్య... తాను ఇంత వరకు గోమాంసం తినలేదని, ఇకపై తింటానని, నన్ను ఆపడానికి వారు ఎవరు? అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే, సిద్ధరామయ్యపై ఆన్ లైన్లో దాడులు పెరిగాయి.

  • Loading...

More Telugu News