: 'అగర్ శౌచాలయ్ నహీతో.. బేటీ నహీ ఔర్ రోటీ నహీ'... ఛత్తీస్ గఢ్ హర్బా తెగ తీర్మానం
దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ పేరుతో పరిసరాలు శుభ్రంగా ఉంచడం, మరుగుదొడ్లు నిర్మించడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని 52 గ్రామ పంచాయతీల్లో ఉన్న హర్బా తెగవారు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'అగర్ శౌచాలయ్ నహీతో.. బేటీ నహీ ఔర్ రోటీ నహీ' అంటూ తీర్మానం చేశారు. అంటే కనీస అవసరమైన మరుగుదొడ్డి లేని ఇంటికి తమ ఆడపిల్లలను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కేవలం టాయిలెట్ సౌకర్యం ఉన్న కుటుంబాల్లో అబ్బాయిలకే తమ ఆడబిడ్డలను ఇచ్చి పెళ్లి చేస్తామని తీర్మానించారు. గ్రామ పంచాయతీల్లోని పారిశుద్ధ్య పరిస్థితులను చక్కదిద్దడం, టాయిలెట్ల నిర్మాణం, వాటి వాడకంలో ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు వివరించారు. మిగతావారికి తమ నిర్ణయం స్పూర్తిగా నిలవాలని కోరుకుంటున్నామన్నారు.