: అవార్డులు వెనక్కివ్వడం బాగోలేదు!: అనిల్ కపూర్
దేశంలో జరుగుతున్న సంఘటనలకు నిరసనగా ప్రతిష్టాత్మక అవార్డులను తిరిగి ఇచ్చివేయడంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ స్పందించారు. ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చివేసే పద్ధతి ఏమీ బాగోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, కళాకారులందరూ ఏకతాటిపై నిలబడాలని ఆయన కోరారు. కాగా, ఫిల్మ్ మేకర్ దివాకర్ బెనర్జీతో పాటు మరో పదకొండు మంది తమ జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చివేశారు. దేశంలో చోటుచేసుకున్న సంఘటనలపై ఎఫ్ టీఐఐ విద్యార్థులు నిరసన తెలిపిన సందర్భంలో వారికి ఫిల్మ్ మేకర్స్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.