: భన్వర్ లాల్ ను తొలగించండి: మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ను తొలగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓట్ల తొలగింపు కార్యక్రమంలో భన్వర్ లాల్ పాత్ర కూడా ఉందని మర్రి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ ఏజెంటుగా భన్వర్ లాల్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వార్డుల విభజనను కూడా శాస్త్రీయ పద్ధతిలో కాకుండా, అశాస్త్రీయంగా చేశారని మండిపడ్డారు. గ్రేటర్ లో తొలగించిన ఓట్ల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.