: అసోం లో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్!


అసోం కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలు చెలరేగాయి. పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేటి ఉదయం అసోం బీజేపీ అధ్యక్షుడు సిద్ధార్థ భట్టాచార్య స్వయంగా ప్రకటించారు. వీరంతా శుక్రవారం నాడు తమ పార్టీలోకి వస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన హిమంత విశ్వ శర్మ నేతృత్వంలో వీరంతా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు సమాచారం. ఈ 9 మందిలో నలుగురిని, విశ్వ శర్మకు మద్దతు పలుకుతున్నారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో పార్టీ నుంచి షోకాజ్ నోటీసులను అందుకున్న మరో ఐదుగురు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారతారని భావిస్తున్న వీరంతా నేడు ఢిల్లీకి వచ్చి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి తమ రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరిపారు కూడా. అమిత్ షాను కలిసిన వారిలో బొలిన్ చేతియా, ప్రదాన్ బారువా, పల్లబ్ లోచన్ దాస్, రాజన్ బోర్థాకుర్, పీజుష్ హజారికా, క్రిపానాథ్ మల్లా, అబూ తాహిర్ బేపారి, బినందా సైకియా, జయంత్ మల్లా బారువాలు ఉన్నారు.

  • Loading...

More Telugu News