: అమరావతి చంద్రబాబు సొంత కోట: ఉండవల్లి విమర్శలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి చంద్రబాబు తన సొంత వాడకానికి కట్టుకుంటున్న కోట అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. అమరావతి నిర్మాణంలో ప్రజలకు భాగస్వామ్యం లేదని వ్యాఖ్యానించిన ఆయన ప్రజలకు నిజం తెలిసే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. ఈ ఉదయం పట్టిసీమ ప్రాజెక్టు జీవో కాపీలను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో అతిపెద్ద అవినీతి బాగోతం దాగుందని నిప్పులు చెరిగారు. రిజర్వాయర్ లేకుండా 80 టీఎంసీల నీటిని తరలించి ఎక్కడ నిల్వ చేస్తారని ప్రశ్నించిన ఆయన, ప్రాజెక్టులో రూ. 490 కోట్లను స్వాహా చేశారని, ఈ విషయమై తాను లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు.