: తాళిబొట్టు అమ్మి పాల డబ్బాలు కొన్నా!...ఈ-మెయిల్ లో ‘సిరిసిల్ల’ కోడలు సంచలన వ్యాఖ్యలు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. భర్త రెండో పెళ్లి చేసుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తన మామ సిరిసిల్ల రాజయ్య వద్ద మొరపెట్టుకున్న సారికకు ఆసరా లభించకపోగా ఛీత్కారాలు ఎదురయ్యాయట. ఈ మేరకు ఆత్మహత్యకు ముందు సారిక తన న్యాయవాది రెహానాకు పంపిన ఈ-మెయిల్ లో పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. ఈ-మెయిల్ లో ఉన్న వివరాల ప్రకారం... రెండోసారి గర్భం దాల్చిన సమయంలో సారికకు అనిల్ కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించలేదు. అంతేకాక రెండో కాన్పులో కవలలకు జన్మనిచ్చిన సారిక తీవ్ర అనారోగ్య సమస్యలకు గురి కాగా ఆమెను పట్టించుకోలేదు. ఇక పిల్లలు పెరుగుతున్న కొద్దీ అనిల్ నుంచి నిరాదరణ మరింత పెరిగింది. కనీసం తినేందుకు సరిపడ డబ్బులు కూడా ఇవ్వలేదు. సరుకులు కూడా కొనివ్వలేదు. ఈ క్రమంలో చిన్న పిల్లలకు పాల డబ్బాలు కొనేందుకు డబ్బుల్లేక సారిక నానా ఇబ్బందులు పడింది. చివరకు తన తాళిబొట్టును అమ్మి పాల డబ్బాలు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో పుట్టింటివారితో మాట్లాడేందుకు యత్నించగా, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవారని సారిక తన ఆవేదనను వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News