: ఛోటా రాజన్ కోసం ప్రత్యేక విమానం పంపిన భారత్


మాఫియా డాన్ చోటా రాజన్ ను ఇండోనేషియా బాలి నుంచి ఈ రాత్రికి భారత్ కు తీసుకురానున్నారు. రెండు రోజుల క్రితం బాలి సమీపంలో ఉన్న అగ్నిపర్వతం పేలడంతో, దట్టంగా పొగ కమ్ముకున్న నేపథ్యంలో విమాన రాకపోకలను నిషేధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి చక్కబడటంతో, విమాన సర్వీసులను పునరుద్ధరించారు. మరోవైపు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని రాజన్ నుంచి రాబట్టాలని భారత్ భావిస్తోంది. దీంతో, ఛోటా రాజన్ సేఫ్టీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో, బాలి నుంచి రాజన్ ను ఇండియాకు తీసుకు రావడానికి ఓ ప్రత్యేక విమానాన్ని భారత అధికారులు పంపించారు.

  • Loading...

More Telugu News