: సారికది ఆత్మహత్య కాదు... కచ్చితంగా హత్యే: న్యాయవాది రెహానా


కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల మరణం కేసులో ఆమె తరపు న్యాయవాది రెహానా పలు విషయాలు వెల్లడించారు. వారిది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని అన్నారు. తనను పనిమనిషిగా చూస్తున్నారని సారిక తనకు చాలాసార్లు చెప్పిందన్నారు. కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని తనవద్ద ఏడ్చిందని తెలిపారు. అనిల్- సనా (రెండో భార్య) అక్రమ సంబంధం గురించి చెబుతూ బాధపడిందని న్యాయవాది చెప్పారు. నెల రోజుల కిందట సారిక తనతో ఫోన్ లో కూడా మాట్లాడిందని, 15 రోజుల కిందట వచ్చి వ్యక్తిగతంగా కలిసిందని వెల్లడించారు. చివరిసారి కలసినప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకుందని, ఎలాగైనా న్యాయం చేయాలని విలపించిందని వివరించారు. కోడలి సంపాదనను కూడా రాజయ్య ఇన్ కం ట్యాక్స్ లో చూపించారని రెహానా తెలిపారు.

  • Loading...

More Telugu News