: ప్రతిరోజు హృతిక్ రోషన్ డాన్స్ చూసి నిద్రపోతా: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్


"హృతిక్ రోషన్ నా రోల్ మోడల్. ఆయన నటించిన సినిమాలన్నీ చూస్తా. ఆయన తొలి సినిమా 'కహో నా ప్యార్ హై' నుంచే నేను వీరాభిమానిని. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు హృతిక్ డాన్స్ వీడియో చూసి, ఆ డాన్స్ నేను చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ పడుకుంటా. అలాగే ఆయన మేనరిజిమ్స్, బాడీలాంగ్వేజ్ నేర్చుకున్నా. కానీ ఆయనంత పర్ఫెక్షన్ సాధించలేకపోయా. ఏ రోజుకైనా ఆ స్థాయికి రావాలన్నదే నా ఆశ" అంటున్నాడు జాకీష్రాఫ్ కొడుకు, బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్. 'హీరోపంతి' చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన టైగర్ డాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. దాంతో అతని బాడీ లాంగ్వేజ్, డాన్సింగ్ అచ్చం హృతిక్ లానే ఉన్నాయంటూ పలువురు పోల్చారు. ఇందుకు సంతోషపడిన ఈ యువహీరో తనకు హృతికే స్పూర్తి అని, అయితే ఆయనకు ఎప్పటికీ పోటీకాలేనని అంటున్నాడు.

  • Loading...

More Telugu News