: ఇలాగైతే ఇంటికే... ఉద్యోగులకు సీరియస్ వార్నింగిచ్చిన 'జొమాటో' చీఫ్


రెస్టారెంట్ సెర్చ్ సేవలందిస్తూ, రూ. 6,500 కోట్ల ఆదాయాన్ని దాటిన తొలి కంపెనీగా నిలిచిన 'జొమాటో' దాదాపు ఐదేళ్ల తరువాత ఆదాయపు లక్ష్యానికి దూరంగా నిలవడంపై ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపేందర్ గోయల్ మండిపడుతున్నారు. పనితీరు సరిగ్గా లేదంటూ, ఇటీవల 300 మంది ఉద్యోగులను తొలగించిన సంస్థలో సేల్స్ టీమ్ ను ఉద్దేశించి ఆయన ఘాటైన లేఖ రాశారు. కంపెనీలో ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని, అత్యుత్తమ సేల్స్ టీములుగా పేర్కొంటున్నవి కూడా రోజుకు నాలుగు సార్లు కలవడం లేదని అన్నారు. కనీసం 5 నుంచి 6 సార్లు కలిసి చర్చించుకోవాల్సిన టీములు, ప్రస్తుతం సగటున 3.5 సార్లు మాత్రమే సమావేశాలు జరుపుతున్నాయని, పరిస్థితి మారకుంటే, ఉద్యోగులను తొలగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఐదేళ్ల తరువాత అనుకున్న ఆదాయ స్థాయిని పొందలేకపోయామని, సేల్స్ టీములు అత్యుత్తమ పనితీరును చూపించాల్సిన సమయం ఇదేనని అభిప్రాయపడ్డారు. ఇండియాలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన జొమాటో 225 మిలియన్ డాలర్లను సేకరించి, ఆ నిధులతో ఆతిథ్య రంగంలో సేవలందిస్తున్న పలు చిన్న చిన్న స్టార్టప్ లను, వెబ్ సైట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News