: మాజీ జాతీయ భద్రతా సలహాదారుపై ‘చెప్పు’ విసిరిన యువకుడు!


జాతీయ భద్రతా సలహాదారుగానే కాక పశ్చిమబెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేసిన ఎంకే నారాయణన్ కు నిన్న తమిళనాడు రాజధాని చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. తమిళ అతివాది ఒకరు నారాయణన్ పై ‘చెప్పు’తో దాడి చేశారు. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా నారాయణన్ పై ‘చెప్పు’ పడింది. శ్రీలంకకు చెందిన తమిళ శరణార్ధుల సంక్షేమంపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. ప్రభాకరన్ అనే ఆందోళనకారుడు విసిరిన ఈ ‘చెప్పు’ నారాయణన్ కు తాకలేదు. దాంతో తనపై ‘చెప్పు’ విసిరిన వ్యక్తి వైపు చూసి నవ్వేసిన నారాయణన్, ఘటనను అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే వెనువెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు మాత్రం ప్రభాకరన్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News