: అమెరికాలోని భారతీయులు ఇళ్లలో మాతృ భాషల్లోనే మాట్లాడుతారు


అమెరికాలో భారతీయులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిన తరువాత తమ మాతృ భాషల్లోనే సంభాషిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. 2009 నుంచి 2013 మధ్య అమెరికాలో భారతీయులపై అమెరికన్ కమ్యూనిటీ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన విశేషాలు వెలుగు చూశాయి. భారతీయులు తమ మాతృభాషల్లోనే మాట్లాడుతున్నారని, అందులో హిందీలో మాట్లాడేవారు అత్యధికులు ఉన్నారని సర్వే వెల్లడించింది. అమెరికాలో ఉన్న భారతీయుల్లో 6.5 లక్షల మంది హిందీ మాట్లాడుతున్నారని తెలిపింది, అలాగే, ఉర్దూ, గుజరాతీ మాట్లాడేవారు 4 లక్షల మంది ఉన్నారని, తెలుగు 2.5 లక్షల మంది, తమిళం 1.9 లక్షల మంది, మలయాళం మాట్లాడేవారు 1.46 లక్షల మంది ఉన్నారు. ఇంగ్లిష్ మినహాయిస్తే 37.4 లక్షల మంది స్పానిష్ మాట్లాడుతూ అగ్రస్థానంలో ఉన్నారని సర్వే వెల్లడించింది. చైనీయులు 2.9 లక్షల మంది తమ మాతృ భాషలో మాట్లాడుతున్నారని, తరువాత ఫ్రెంచ్ 1.3 లక్షల మంది, కొరియన్లు 1.1 లక్షల మంది, జర్మన్లు 1.1 లక్షల మంది తమతమ మాతృభాషల్లో మాట్లాడుతున్నారని ఆ సర్వే తెలిపింది.

  • Loading...

More Telugu News