: గ్యాస్ లీక్ కాలేదు...ఆ సిలిండర్ లో గ్యాసే లేదు...రాజయ్య కోడలు, మనవల మరణాలలో వెలుగు చూసిన కొత్త కోణం!


మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మరణం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సారిక బెడ్ రూంలో ఉన్న గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కాలేదని, అసలు ఆ సిలిండర్ లో గ్యాసే లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అంతా అవాక్కయ్యారు. దీంతో సారికది ఆత్మహత్య కాదని, హత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. సారికను, పిల్లలను ముందుగానే హత్య చేసి, తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కేసును హత్య కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. 3:40 నిమిషాల నుంచి 4:00 గంటల మధ్య ఈ మరణాలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే, 4:30 నిమిషాలకు ఈ సంఘటన జరిగిందని మాజీ ఎంపీ చెబుతున్నట్టు పోలీసులు వివరిస్తున్నారు. ఆమెను హత్య చేసిన అనంతరం వంట గదిలోని సిలిండర్ ను బెడ్ రూంలోకి తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. అయితే, ఆ రూం నుంచి దట్టమైన పొగలు వస్తున్నట్టు చుట్టుపక్కల వారు చూసి చెప్పినట్టు పేర్కొంటున్నారు. గ్యాస్ ప్రమాదం అయితే మరింత తీవ్రంగా ఉండేదని పోలీసులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News