: 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్' జ్యూరీ మెంబర్ గా విద్యా బాలన్


బాలీవుడ్ నటి విద్యాబాలన్ మరో కొత్త అవతారం ఎత్తబోతుంది. సినిమాల్లో తనదైన నటనతో అలరిస్తున్న విద్య 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్-2013' జ్యూరీ మెంబర్ గా ఎంపికయింది. కేన్స్ జూర్యీలో హాలీవుడ్ దర్శకులు స్టీవెన్ స్పిల్ బర్గ్, ఆంగ్ లీ, జపనీస్ దర్శకుడు నవోమి కవాసే, నటి, నిర్మాత నికోల్ కిడ్ మన్, స్కాటిష్ దర్శకుడు లిన్నే రమ్సే, ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు డానియేల్, రుమేనియన్ దర్శకుడు క్రిస్టియన్ ముంగి, నటుడు క్రిస్ట్ఫో వాల్ట్జ్ మెంబర్లుగా ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో విద్య కూడా చేరింది. మే15 నుంచి 26 వరకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. దీనిపై విద్య ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News