: మరో విమాన ప్రమాదం... దక్షిణ సూడాన్ లో కూలిన కార్గో విమానం


రష్యా విమాన దుర్ఘటన మరువకముందే గగనతలంలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కార్గో విమానం ఒకటి దక్షిణ సూడాన్ రాజధాని జుబాలో కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందారని దక్షిణ సూడాన్ అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిందని తెలిసింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 20 మంది ఉన్నారని, వారిలో ముగ్గురు మాత్రమే క్షేమంగా బయటపడ్డారని సమాచారం. మిగిలిన మృతులంతా విమానం కూలిన ప్రదేశంలో ఉన్నవారిగా అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News