: రాజయ్య ఇంట్లో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం: జానారెడ్డి
టి.కాంగ్రెస్ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఇవాళ జరిగిన విషాద ఘటనపై ఆ పార్టీ నేత జానారెడ్డి స్పందించారు. రాజయ్య నివాసంలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపదని చెప్పారు. ఘటనకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారని, అయితే పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ఘటనతో దిగ్భ్రాంతి చెందారని తెలిపారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేతలతో కలసి ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.