: గ్రేటర్ లో ఓటర్ల నమోదుకు ఇవాళే ఆఖరు: జీహెచ్ఎంసీ కమిషనర్
గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త ఓటర్ల నమోదు, సవరణకు ఇవాళే చివరి రోజని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జనార్దన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా నగరంలోని ఓటర్లు జాబితాలో తమ పేరు ఉందా? లేదా? చూసుకుని, కొత్తగా నమోదు చేసుకోవాలని చెప్పారు. ఓట్ల సవరణలు, మార్పులకు అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. జనవరిలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో నేటి వరకు జాబితాలో చోటున్న, నమోదు చేసుకున్న వారికే ఓటు హక్కు ఉండే అవకాశం ఉందని చెప్పారు.