: బాయ్ ఫ్రెండ్ ను కోటీశ్వరుడిని చేసేందుకు కంపెనీనే మోసం చేసింది!


నిరుద్యోగిగా ఉన్న తన బాయ్ ఫ్రెండ్ జీవితంలో నిలదొక్కుకోవాలని ఆమె భావించింది. అందుకోసం తాను పనిచేస్తున్న కంపెనీ రహస్యాలను వెల్లడించింది. స్నేహితుడిని కోటీశ్వరుడిని చేసింది గానీ, ఇప్పుడు అమెరికాలో పోలీసు కేసులను ఎదుర్కొంటోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, దొడ్డి షర్మిల అనే యువతి యూఎస్ లోని వేల్స్ అండ్ ఫార్గో సంస్థలో అనలిస్టుగా పని చేస్తోంది. డెంటల్ సంస్థ 'అమెరికన్ డెంటల్ పార్ట్ నర్స్'తో 398 మిలియన్ డాలర్ల విలువైన డీల్ ను కుదుర్చుకునే దిశగా వేల్స్ అండ్ ఫార్గో అడుగులు వేస్తోంది. ఈ విషయమై ఎటువంటి వార్తా బయటకు రాని సమయంలో షర్మిల తన బాయ్ ఫ్రెండ్ వ్లాడ్ స్పివాక్ కు విషయం చెప్పింది. దీంతో అతను డెంటల్ సంస్థ వాటాలను కొనుగోలు చేశాడు. ఆపై ఇరు కంపెనీల మధ్యా డీల్ ప్రకటితం కాగా, ఆ సంస్థ ఈక్విటీ అమాంతం పెరిగింది. దీంతో స్పివాక్ కు 2.22 లక్షల డాలర్లు (సుమారు రూ. 14.4 కోట్లు) లాభం వచ్చింది. విషయాన్ని గమనించిన సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ షర్మిలపై కేసు నమోదు చేసింది. ఆమె కావాలనే సంస్థ వివరాలు బయటకు వెల్లడించిందని, ఆమెను తొలగించామని వేల్స్ ఫార్గో ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, ఆమె స్వయంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ లో పాల్గొనలేదు కాబట్టి భారీ జరిమానాతో సరిపెట్టవచ్చని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News