: మా బిడ్డను ‘సిరిసిల్ల’ కుటుంబం హత్య చేసింది: సారిక తల్లిదండ్రుల ఆరోపణ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య కుటుంబంపై ఆయన కోడలు సారిక తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. నేటి తెల్లవారుజామున రాజయ్య ఇంటిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తన ముగ్గురు పిల్లలు సహా సారిక దుర్మరణం పాలైంది. మూడంతస్తుల భవంతిలోని తొలి అంతస్తులో పిల్లలతో కలిసి పడుకున్న సారిక బెడ్ రూములో మంటలు చెలరేగాయి. గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నిజామాబాదుకు చెందిన సారిక తల్లిదండ్రులు కొద్దిసేపటి క్రితం సంచలన ఆరోపణలు చేశారు. సిరిసిల్ల రాజయ్య కుటుంబ సభ్యులు తమ బిడ్డను హత్య చేశారని వారు ఆరోపించారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని కూడా వారు పేర్కొన్నారు. దీంతో రాజయ్య కుటుంబం మరింత చిక్కుల్లో పడిపోయింది.