: సారీ... పోటీ చేయలేను: అధిష్ఠానికి తేల్చిచెప్పిన సిరిసిల్ల రాజయ్య


‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయలేను. అభ్యర్థిని మార్చండి. నన్ను క్షమించండి’’ అని వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కొద్దిసేపటి క్రితం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కోరారు. నేటి తెల్లవారుజామున రాజయ్య ఇంటిలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఆయన కోడలు సారిక సహా ఆయన ముగ్గురు మనవలు దుర్మరణం పాలయ్యారు. దీంతో శోకసంద్రంలో కూరుకుపోయిన రాజయ్య ఇంటి ఆవరణలోనే కుప్పకూలిపోయారు. ఇదిలా ఉంటే, వరంగల్ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే ఓ సెట్ నామినేషన్ దాఖలు చేసిన రాజయ్య, నేడు మరో సెట్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఇందుకోసం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. దుర్ఘటన నేపధ్యంలో తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని, తన స్థానంలో మరో అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆయన అధిష్ఠానానికి సూచించారు. దీంతో అభ్యర్థిని మార్చేందుకు అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.

  • Loading...

More Telugu News