: నాడు ‘సిరిసిల్ల’ కుటుంబంపై సారిక 498 సెక్షన్ కింద ఫిర్యాదు... నేడు పిల్లలతో సజీవ దహనం


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య కుటుంబంపై ఆయన కోడలు సారిక గతంలో సెక్షన్ 498 కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త సిరిసిల్ల అనిల్ తో పాటు అత్తమామలు కూడా తనను, తన పిల్లలను సరిగా చూసుకోవడం లేదని సదరు ఫిర్యాదులో ఆమె పోలీసులకు తెలిపింది. నాడు తన ముగ్గురు పిల్లలతో కలిసి రాజయ్య ఇంటిముందే బైఠాయించింది. మీడియా ముందు కూడా తన ఆవేదనను వ్యక్తం చేసింది. సారిక ఫిర్యాదుపై నాడు కేసు నమోదైనా, ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. అయితే పోలీసులకు ఫిర్యాదు అందేనాటికే సారిక, అనిల్ ల మధ్య పూర్తి స్థాయిలో సంబంధాలు దెబ్బతిన్నాయి. మూడంతస్తుల భవంతిలో ఓ ఫ్లోర్ లో రాజయ్య దంపతులు ఉంటుండగా, రాజయ్య కుమారుడు అనిల్ మరో ఫ్లోర్ లో ఉంటున్నాడు. సారిక మాత్రం తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంకో ఫ్లోర్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో నేటి తెల్లవారుజామున సారిక ఉంటున్న ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో సారిక తన ముగ్గురు పిల్లలతో కలిసి సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News